<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>స్తోత్రం చెల్లింతుము</title>
<lyrics>[C1]
   స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
   యేసు నాథుని మేలులు తలంచి // స్తోత్రం //

[V1]
 దివారాత్రములు కంటిపాపవలె కాచి
 దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి // స్తోత్రం //

[V2]
 గాడాంధకారములో కన్నీటి లోయలలో
 కృశించి పోనీయక కృపలతో బలపరచితివి // స్తోత్రం //

[V3]
 సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
 సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి // స్తోత్రం //

[V4]
 సీయోను మార్గములో పలుశోధనలు రాగా
 సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి // స్తోత్రం //

[V5]
 సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
 యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి // స్తోత్రం //

[V6]
 పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా
 సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా // స్తోత్రం //</lyrics>
<hymn_number>326</hymn_number>
</song>